తమిళనాడులోని కరూర్‌లో.. సినీ నటుడు, టీవీకే అధ్యక్షుడు విజయ్ ప్రచారసభ సందర్భంగా ఘోర విషాద ఘటన సంభవించింది. తొక్కిసలాట చోటుచేసుకుని ఎనిమిది మంది చిన్నారులు సహా 38 మంది మరణించారు. వచ్చే ఏడాది తమిళనాడులో జరగనున్న శాసనసభ ఎన్నికలకు సిద్ధమవుతున్న విజయ్ ఈ నెల 13న రాష్ట్రవ్యాప్త ప్రచారయాత్రను ప్రారంభించారు. శనివారాల్లో మాత్రమే రెండేసి జిల్లాల్లో ప్రచారం చేస్తున్నారు. ఈ శనివారం నామక్కల్‌లో ఉదయం ప్రచారం చేపట్టి సాయంత్రం కరూర్ చేరుకున్నారు. అక్కడి వేలుసామిపురంలో రాత్రి 7.30 గంటలకు విజయ్ ప్రసంగిస్తుండగా ఆయనకు సమీపంగా వచ్చేందుకు పలువురు ప్రయత్నించారు. దీంతో తొక్కిసలాట చోటుచేసుకుంది. పిల్లలు, మహిళలు, వృద్ధులు అందులో చిక్కుకున్నారు. ఒకరి తర్వాత ఒకరు స్పృహతప్పి పడిపోవడంతో పరిస్థితి గందరగోళంగా మారింది. ఉద్రిక్తత చోటుచేసుకుంది. 8 మంది చిన్నారులు, 16 మంది మహిళలు సహా 39 మంది మరణించినట్లు రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది.

Visuals from the spot where a stampede occurred yesterday, during a public event of TVK chief and actor Vijay at Karur, Tamil Nadu. 39 people have lost their lives in the incident.

#Vijay
#KarurStampede
#TVK
#pawankalyan
#TamilNaduNews
#BreakingNews
#VijayRally
#PoliticalNews
#CrowdTragedy
#ActorVijay
#TVKStampede

~PR.358~CA.43~HT.286~